తమిళనాట విప్లవ నాయకిగా…

182
Amma Jayalalithaa no more
- Advertisement -

పురచ్చితలైవి..! తమిళ రాకీయాల్లో విప్లవ నాయకిగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన ధీరవనిత. ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టించినా.. తన నిర్ణయాలతో విపక్షాల ప్రశంసలనూ అందుకున్న అద్వితీయ నేత జయలలిత. డేరింగ్‌ ..డాషింగ్‌ పర్సనాలిటీతో తమిళ పాలిటిక్స్‌ కు రాకెట్‌ స్పీడ్‌ను నేర్పిన నాయకురాలు. ద్రవిడ పార్టీల పాలిటిక్స్ లో ఓ మిస్సైల్లా దూసుకొచ్చిన జయలలిత.. ప్రధాన ప్రత్యర్థి .. రాజకీయ దురంధరుడు కురుణానిధిని గిరిగీసి నిలువరించిన పొలిటికల్‌ చతురత ఆమెది.

పెరియార్‌ రామస్వామి నాయకర్‌ ప్రారంభించిన ద్రవిడ మున్నేట్ర కళగం వేదికను.. మలిదశలో పరుగులు పెట్టించిన ఎంజీఆర్‌కు.. రాజకీయ వారసురాలిగా 1982లో ఘనంగా పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చారు జయ. ఆమె ఎంట్రీతో ద్రవిడపార్టీల ప్రాభవం ఉన్నత శిఖరాలకు చేరుకుంది. కామరాజ్‌ నాడార్‌ హయాంలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్రంలో ఉనికే లేకుండా చేసిన చరిత్ర ద్రవిడ పార్టీలది. అందులోనూ జయలలిత ఎంట్రీ తర్వాత జాతీయ పార్టీలంటేనే తమిళ ప్రజలు మర్చిపోయే స్థాయి వచ్చింది.

1991లో మొదటిసారిగా సీఎం పగ్గాలు చేట్టిన జయ..ఎప్పటికపుడు కొత్తకొత్త ప్రజాకర్షక పథకాలతో విపక్షాలను .. ముఖ్యంగా డీఎంకే అధినేత కరుణానిధిని ఉక్కిరిబిక్కిరి చేశారు. 1996లో అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో కూర్చున్న జయలలితపై డీఎంకే.. కక్షసాధింపుకు అసెంబ్లీనే సాక్షిగా నిలిచింది. అవమానాలు ఎదురైనా.. ధైర్యంగా ముందుకు సాగిన ధీశాలి. ఎన్నో సంక్షేమపథకాలు ప్రవేశపెట్టి.. అభాగ్యులను అన్నార్తులను .. ఆదుకోవడంలో జయ అందరికంటే ముందుంటారు. పవర్‌లో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఆమె తమిళ రాజకీయాలను శాసించారు. అందుకే తమిళ ప్రజలు ఆమెను పురట్చితలైవి…అని సగర్వంగా చెప్పుకుంటారు.

అవమానాలు ఎదుర్కొంది వాటిని దిగమింగలేదు దెబ్బకు దెబ్బతీసింది. ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసింది. ప్రత్యర్థులకు ఓటమి రుచి చూపించింది. ప్రతిక్షణం పోరాటం ప్రత్యర్థులతో పోరు..కేసులు ఇవన్ని జయలలితలో ఉన్న స్వభావాన్ని మొండి స్వభావంగా మార్చింది. మహిళను అని చూడకుండా అవమానించిన చోటే తమిళనాడు ముఖ్యమంత్రిగా తన సమర్థతను చాటింది. పురచ్చితలైవి(విప్లవ నాయకిగా)పేరు తెచ్చుకుంది.

- Advertisement -