అమిత్ షా టార్గెట్.. బీజేపీ నేతల్లో గుబులు?

69
- Advertisement -

వచ్చే ఎన్నికలలో గెలిచి ఎలాగైనా తెలంగాణలో అధికారం చేపట్టాలని బీజేపీ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. అయితే ఆ మద్య నానా హడావిడి చేసిన బీజేపీ ఈ మద్య మాత్రం చాలా స్లో అయింది. దానికి కారణం కూడా అందరికీ తెలిసిందే. మే లో జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం మాదే అని ధీమా వ్యక్తం చేసిన కమలనాథులకు ఆ రాష్ట్ర ప్రజలు ఊహించని షాక్ ఇస్తూ ఘోర ఓటమిని కట్టబెట్టారు. దాంతో దెబ్బకు ఓవర్ కాన్ఫిడెన్స్ పోయి భయం పట్టుకుంది. ఎందుకంటే బీజేపీ బలంగా ఉన్న కర్నాటకలోనే ఓటమి చవిచూసిందంటే.. ఇక తెలంగాణలో అంతకు మించిన ఘోర ఓటమి తప్పదు.. ఇక్కడ బి‌ఆర్‌ఎస్ అత్యంత పటిష్టమైన పార్టీగా ప్రజల్లో సుస్థిర స్థానాన్ని పొందింది. .

అలాంటి పార్టీని ఢీ కొట్టి నిలిచి గెలవడం బీజేపీకి అంతా తేలికైన విషయం కాదు. దాంతో గెలుపు సంగతి అటుంచితే పార్టీ బలపడితే చాలు అనుకునే స్టేజికి వచ్చారు తెలంగాణ బీజేపీ నేతలు. అయితే అధిష్టానం మాత్రం అధికారమే అంతిమ లక్ష్యమని రాష్ట్ర నేతలకు టార్గెట్ ఫిక్స్ చేస్తోంది. తాజాగా తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశం అయిన అమిత్ షా.. వారికి స్పష్టమైన టార్గెట్ ఫిక్స్ చేశారట. వచ్చే ఎన్నికల్లో పార్టీ ఎలాగైనా 75 స్థానాలు సాధించాలని అందుకోసం ఎంత పెద్ద లీడర్ అయిన ఎన్నికల బరిలో నిలిచి గెలవాల్సిందే అని తేల్చి చెప్పారట. కిషన్ రెడ్డితో సహ ప్రతిఒక్కరు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉండాల్సిందేనని సూచించినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం పార్టీలోని కీలక నేతలలో టాప్ 25 మంది లిస్ట్ రెడీ చేసి వారు మరింత దూకుడు గా వ్యవహరించాలని చెప్పుకొచ్చారట అమిత్ షా. అసలే పార్టీ బలం అంతంత మాత్రమే ఉన్న నేపథ్యంలో అధిష్టానం ఇలాంటి టార్గెట్లు ఫిక్స్ చేస్తుండడంతో కమలనాథులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోతున్నట్లు తెలుస్తోంది. మరి వచ్చే ఎన్నికల్లో అనుకున్న లక్ష్యాలను కమలం పార్టీ ఎంతవరుకు అధిగమిస్తుందో చూడాలి.

Also Read:ఏపీలో ఆ నిర్మాతకు ఇక గడ్డు కాలమే

- Advertisement -