Amit Shah : విపక్షాల లక్ష్యమదే!

24
- Advertisement -

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది దేశ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార విపక్ష పార్టీల మధ్య వాడి వేడి విమర్శలు, ఆరోపణలు పొలిటికల్ హిట్ పెంచుతున్నాయి. తాజాగా బీజేపీ అగ్రనేత, హోంమంత్రి అమిత్ షా విపక్ష పార్టీలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. విపక్షాల లక్ష్యం దేశాభివృద్ది కాదని.. విపక్ష నేతలు వ్యక్తిగత లక్ష్యాలు కలిగి ఉన్నారని అమిత్ షా వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ” సోనియా గాంధీ లక్ష్యం రాహుల్ గాంధీని ప్రధాని చేయడం, శరత్ పవార్ లక్ష్యం తన కూతురుని సి‌ఎం చేయడం, మమతాబెనర్జీ తన అల్లుడిని, స్టాలిన్ తన కుమారుడిని సి‌ఎంలు గా చేసే లక్ష్యాలను కలిగి ఉన్నారని ” వీరంతా వ్యక్తిగత లభ్ది కోసం పని చేస్తున్నారని అమిత్ షా వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండి పడుతున్నాయి..

తమ లక్ష్యం బీజేపీని గద్దె దించి దేశానికి విముక్తి కలిగించడమే అని చెబుతున్నాయి. ఈసారి ఎన్డీయేను గద్దె దించే ప్రయత్నంతో విపక్ష పార్టీలన్ని కలిసి ఇండియా కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఇండియా కూడమిలో అంతర్గత విభేదాలు గట్టిగానే కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇండియా కూటమికి మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వంటి వారు అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. పైగా కాంగ్రెస్ తో ఇతర పార్టీలకు ఏ మాత్రం పొసగడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఈ పరిణామాలను బట్టి చూస్తే అమిత్ షా చెప్పినట్లుగా ఇండియా కూటమిలో వ్యక్తిగత లబ్ధికోసమే నేతలు ప్రయత్నిస్తున్నారా ? అనే సందేహాలు రాకమానవు. మరి బీజేపీని గద్దె దించే లక్ష్యంతో ఉన్న విపక్షాలు ఏకతాటిపైకి వచ్చి వ్యక్తిగత లభ్దిని పక్కన పెట్టి పక్కన పెట్టాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. అధికారమే లక్ష్యంగా ముందుకు సాగినప్పుడే ఇండియా కూటమి బలపడుతుందనేది చాలమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నా మాట.

Also Read:Vishal:ఎనిమిది కోట్లు వద్దన్న విశాల్

- Advertisement -