- Advertisement -
ఆపరేషన్ మహదేవ్ పై అమిత్ షా కీలక ప్రకటన చేశారు. పార్లమెంట్‌లో రెండో రోజు ఆపరేషన్ సిందూర్ పై ప్రకటన చేసిన షా.. పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకున్నామని తెలిపారు. పహల్గామ్ దాడి కీలక నిందితుడు హతమయ్యాడని స్పష్టంచేశారు.
మతం అడిగి మరీ హతమార్చడం దారుణమని .. జమ్మూకశ్మీర్‌లో ఆపరేషన్ మహదేవ్ కొనసాగుతోందని వెల్లడించారు. ఉగ్రవాదులను హతమార్చితే ప్రతిపక్షాలకు ఏ మాత్రం ఆనందంగా లేదని చురకలు అంటించారు.
ఆశించిన రాజకీయ, సైనిక లక్ష్యాల ను చేరుకున్నందు వల్లనే ఆపరేషన్ సిందూర్ కు విరామం ఇచ్చామని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి ఒత్తిడి లేదని …పాకిస్థాన్ మరోసారి దుస్సాహసానికి ఒడిగడితే ఈ ఆపరేషన్‌ను పునరుద్ధరిస్తామని హెచ్చరించారు.
Also Read:కోమటిరెడ్డి వర్సెస్ ఉత్తమ్..!
- Advertisement -

