దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఒడిశా-చత్తీస్‌ఘడ్ బోర్డర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో 14 మంది నక్సల్స్ మృతిచెందినట్లు చెప్పారు.
నక్సల్స్ రహిత భారత్ దిశగా కీలక అడుగు పడిందన్నారు. మన భద్రతా దళాలకు ఇది గొప్ప విజయమన్నారు. ఒడిశా-చత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లో.. సీఆర్పీఎఫ్, ఎస్ఓజీ ఒడివా, చత్తీస్‌ఘడ్ పోలీసులు 14 మంది నక్సల్స్‌ను జాయింట్ ఆపరేషన్ ద్వారా మట్టుబెట్టారని, నకల్స్ రహిత్ భారత్ లక్ష్యంగా భద్రతా దళాలు చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌తో నక్సలిజం కొన ఊపిరితో ఉన్నట్లు కేంద్ర మంత్రి షా పేర్కొన్నారు.
చత్తీస్‌ఘడ్ సీఎం విష్ణు దేవ్ సాయి భద్రతా దళాలను ప్రశంసించారు. 2026 మార్చి నాటికి చత్తీస్‌ఘడ్ నుంచి నక్సలిజాన్ని తరిమివేయనున్నట్లు చెప్పారు. సైనికుల సాధించిన విజయం అద్భుతమని, వారి సాహసానికి సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు.
Also Read:WHO నుండి అమెరికా ఉపసంహరణ