అమిత్‌షా ఎన్టీఆర్‌ భేటీ.. ఏం మాట్లాడుకుంటారు?

45
ntr
- Advertisement -

బీజేపీ భారీ బహిరంగ సభకు విచ్చేస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా టాలీవుడ్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ను కలవనున్నారు. శంషాబాద్‌ నోవాటెల్‌ హోటల్‌ కు రావాలని ఇప్పటికే ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందినట్లు సమాచారం మునుగోడు సభకు ముఖ్యఅతిథిగా వస్తున్న అమిత్‌షా ఎన్టీఆర్‌ను ప్రత్యేకంగా భేటీకి ఆహ్వానించడంపై సర్వత్రా అసక్తి నెలకొంది. ఏయే అంశాలపై ఎన్టీఆర్‌ సమావేశం కానున్నారు. అమిత్‌షా ఎన్టీఆర్‌ భేటీలో వీరిద్దరూ ఏం మాట్లాడుకుంటారు. అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అమిత్‌షా ఎన్టీఆర్‌ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

అయితే ఇటీవల కాలంలో రాజ్యసభకు నామీనెట్‌ అయిన విజయేంద్రప్రసాద్‌తో ఆర్‌ఎస్‌ఎస్‌ అనే ఒక బలమైన అంశంతో ఎన్టీఆర్‌ నాయకుడిగా సినిమా తీయాలకునుకుంటున్నారు. 2009లో టీడీపీ తరపున తారక్‌ ప్రచారం చేశారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటున్నారు. తాజా పరిణామాలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. గత కొంత కాలంగా రాష్ట్రంపై ఫోకస్‌ బీజేపీ రానున్న రోజుల్లో మరింతగా దూకుడు పెంచనున్నట్టు తెలుస్తొంది.

- Advertisement -