Amith Shah:కొత్త చట్టాలతో సత్వర న్యాయం

16
- Advertisement -

కొత్త చట్టాలతో విచారణ వేగవంతం అవుతుందని, బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌), భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌), భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్‌) చట్టాలను తీసుకురాగా నేటి నుండి అమల్లోకి వచ్చాయని తెలిపారు.

భారతీయ విలువల ఆధారంగా నూతన చట్టాలు పనిచేస్తాయని …. వలసవాద చట్టాలకు పాతరేసి భారత పార్లమెంట్‌లో రూపొందిన చట్టాలు అమల్లోకి వచ్చాయని చెప్పారు. నూతన చట్టాల అమలుతో జాప్యాలకు చెల్లుచీటీ సాధ్యమై విచారణ వేగవంతమై సత్వర న్యాయం అందుబాటులోకి వస్తుందని అన్నారు. గ

నూతన చట్టాల కింద తొలి కేసు దేశ రాజధానిలో నమోదు అయింది.న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ సమీపంలో పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా.. ఆ‍ వ్యాపారి రోడ్డు మీద గుట్కా, వాటర్‌ బాటిల్స్‌ అమ్ముతూ వారికి కనిపించాడు. భారతీయ న్యాయ సంహిత క్రిమినల్‌ కోడ్‌లోని సెక్షన్‌ 285 ప్రకారం.. కమలా మార్కెట్‌ పోలీస్‌ స్టేషన్‌లో అతనిపై కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు.

Also Read:కౌశిక్ దర్శకత్వంలో బెల్లంకొండ!

- Advertisement -