రెండో డోసు టీకా తీసుకున్న మెగాస్టార్‌..

174
Amitabh Bachchan
- Advertisement -

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఎంతో మంది సినీ తారలు, క్రీడా ప్రముఖులు కరోనా టీకా తీసుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్‌ మెగాస్టార్‌ బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ క‌రోనా టీకా తీసుకున్నారు. ముంబైలో నిన్న వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోల‌ను ఆదివారం ఉద‌యం ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అమితాబ్ త‌న మొద‌టి డోసును ఏప్రిల్ 2న తీసుకున్నారు.

‘రెండో డోసు కూడా తీసుకున్నాను. నిన్న కుటుంబంతోపాటు, స్టాఫ్ అంతా ప‌రీక్ష‌లు చేయించుకున్నాం. అంద‌రికీ నెగెటివ్ వ‌చ్చింది. దీంతో అభిషేక్ మిన‌హా కుంటుంబ‌స‌భ్యుల‌మంతా వ్యాక్సిన్ తీసుకున్నాం. అభిషేక్ ప్ర‌స్తుతం లోకేష‌న్‌లో ఉన్నాడు. మ‌రికొద్దిరోజుల్లో అత‌ను తిరిగి రానున్నాడు. అప్పుడు అత‌డు కూడా వ్యాక్సిన్ తీసుకుంటాడు’ అని ఇన్‌స్టాలో పేర్కొన్నారు.

ఇక ఆ మధ్య అమితాబ్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన సంగతి తెలిసిందే. ఇక అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘మేడే’, ‘గుడ్​బై’ సహా పలు చిత్రాల్లో బిగ్​బీ నటిస్తున్నారు.

- Advertisement -