మెగా స్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో సురెందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సైరా. స్వాతంత్ర్య సమరయోధుడు సైరా నరసింహరెడ్డి జీవిత కథ ఆధారంగా ఈసినిమాను చిత్రికరించారు. చిరు సరసన నయనతార నటించగా..విజయ్ సేతుపతి, సుదీప్ కిచ్చ,, అమితాబ్ బచ్చన్ లు ప్రధాన పాత్రల్లో నటించారు. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో ఈసినిమాను నిర్మించారు. తెలుగుతో పాటు తమిళ్ , కన్నడ, మలయాళం, హిందీలో ఈసినిమాను విడుదల చేయనున్నారు.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు పాత్ర గోసాయి వెంకన్న పాత్రలో నటించారు. ఈసినిమా టీజర్ ను ముంబాయిలో విడుదల చేశారు. ఈసందర్భంగా అక్కడి మీడియా ప్రతినిధులతో రామ్ చరణ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
అమితాబ్ బచ్చన్ ఈసినిమాను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేశారట… కేవలం చిరంజీవి మీద ప్రేమతో అమితాబ్ డబ్బులు తీసుకోకుండా పనిచేశారట. అమితాబ్ కోసం ప్రైవేటు జెట్ ఏర్పాటు చేస్తామని చెప్పినా అతను నిరాకరించాడట. కనీసం ఫ్లైట్ టికెట్ బుక్ చేద్దామని అడిగితే అది కూడా వద్దు అని చెప్పారట. తన సొంత డబ్బులు పెట్టుకుని షూటింగ్ కు హాజరయ్యాని తెలిపారు.