పవన్‌తో భేటీ కానున్న అమిత్‌ షా..?

325
Amit Shah to Meet Pawan?
- Advertisement -

లౌకిక పార్టీల ఐక్యత పేరుతో ప్రతిపక్షాలన్ని ఏకతాటిపైకి వస్తుండటంతో బీజేపీ కొత్త పల్లవి అందుకుంది. ఎన్డీఏలో అసంతృప్తి గళం వినిపిస్తున్న నేతలను కలవడంతో పాటు కొత్తవారిని ఆకర్షించే లక్ష్యంగా మోడీ-షా టీం మద్దతు కోసం కలుసుకోవడం (సంపర్క్‌ సే సమర్థన్‌) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రభంజనం, ఆయా రాష్ట్రాల్లో మిత్రపక్షాలకున్న సామాజిక వర్గాల అండదండలు ఎన్డీఏ కూటమికి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టాయి. కానీ ప్రస్తుతం ఆ పరిస్ధితి లేదు.ఎన్డీయే నుంచి టీడీపీ బయటికి రావడం, శివసేన లాంటి మిత్రపక్షం కూడా బీజేపీపై బహిరంగ విమర్శలకు దిగే పరిస్ధితి వచ్చింది. ఈ నేపథ్యంలో  పలువురిని స్వయంగా కలుస్తున్నారు బీజేపీ చీఫ్ అమిత్ షా.

amith shah

ఈ క్రమంలోనే భాగంగా జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్‌ను కలుస్తారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇటీవలె ఎన్డీయే నుంచి టీడీపీ బయటికి రావడంతో ఇరు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితి నెలకొంది. దీంతో 2014 ఎన్నికల్లో వీరి కూటమికి మద్దతిచ్చిన పవన్‌ను మచ్చిక చేసుకునేందుకు అమిత్ షా పావులు కదుపుతున్నారు.

ఇందులో భాగంగానే త్వరలోనే పవన్‌ను షా కలవనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన పవన్…టీడీపీ వైఖరిని ఎండగడుతు ముందుకుసాగుతున్నారు. అదే క్రమంలో బీజేపీపై విమర్శలు చేయడం లేదు. దీంతో పవన్‌తో దోస్తి కట్టి వచ్చే ఎన్నికల్లో మెరుగైన సీట్లు సాధించేందుకు కాషాయ పార్టీ వ్యూహం సిద్ధం చేస్తోంది.

ఇటీవలె కేంద్ర మంత్రి, ఎల్‌జేపీ అధినేత రాంవిలాస్‌ పాస్వాన్‌తో, బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ ఆమె భర్త డాక్టర్ శ్రీరామ్‌తో అమిత్ షా భేటీ అయ్యారు. తాజాగా ముంబైలో శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రేతో భేటీ అయ్యారు షా. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని శివసేన తేల్చింది. ఈ నేపథ్యంలో అమిత్‌ షా..ఉద్దవ్‌తో భేటీ కాగా వీరి సమావేశంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ భేటీకి సీఎం ఫడ్నవిస్‌ను దూరంగా ఉంచాలని ఉద్దవ్ కోరారు. దీంతో ఫడ్నవిస్‌ ఈ సమావేశానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. పంజాబ్‌లో అకాలీదళ్‌ అధినేత ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌, ఆయన తనయుడు సుఖ్‌బీర్‌ బాదల్‌లతో షా భేటీ కానున్నారు. మొత్తంగా షా చేపట్టిన దిద్దుబాటు చర్యలు ఏ మేరకు ఫలితం ఇస్తుందో వేచిచూడాలి.

- Advertisement -