తెలంగాణ బీజేపీ నేతలకు గుబులు పట్టుకుందా ? రాష్ట్రంలో బీజేపీకి ఊహించినంతా సీన్ లేదా ? రాష్ట్ర బీజేపీ నేతలతో అమిత్ షా భేటీకి కారణం ఏంటి ? అసలు బీజేపీ ఏం చేయబోతుంది ? ఇలాంటి ప్రశ్నలు తెలంగాణ పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ డిబేట్లకు కారణం అవుతున్నాయి. గతంతో పోలిస్తే రాష్ట్రంలో ప్రస్తుతం కమలం పార్టీ ఫుల్ యాక్టివ్ గా ఉంది. వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టాలని ఉవ్విళ్లూరుతుంది. అయితే అది అంత సులభం కాదనే సంగతి కమలనాథులకు కూడా బాగా తెలుసు. ఎందుకంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ పార్టీ పై కేసిఆర్ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో టిఎస్ ప్రజానీకం బీజేపీని నమ్మే పరిస్థితి లేదు.
దాంతో ప్రజా మద్దతు పొందేందుకు పాదయాత్రలు చేస్తూ.. అధికార పార్టీపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నప్పటికి వారి ప్రయత్నాలన్నీ బెడిసి కొడుతున్నాయి. మరోవైపు ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దాంతో ప్రజానీకానికి ఎలా దగ్గరవ్వాలనే దానిపై ముమ్మర కసరత్తులు చేస్తున్నారు కమలనాథులు.. తాజాగా తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా డిల్లీలోని నడ్డా నివాసంలో భేటీ అయ్యారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తో పాటు లక్ష్మణ్ వంటి ఇతర నాయకులు కూడా హాజరయ్యారు.
అయితే అమిత్ షా బేటీకి అసలు కారణం ఏంటి అనే దానిపై రకరకాల వార్తలు పోలిటికల్ సర్కిల్స్ లో వైరల్ అవుతున్నాయి. రాష్ట్ర నేతలు యాక్టివ్ గా ఉండడంలో నిర్లక్షం వహిస్తున్నారని, అందుకే క్లాస్ పికేందుకు అమిత్ షా భేటీ నిర్వహించారని కొందరి అభిప్రాయం. అలాగే బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర పై కూడా ప్రజల నుంచి పెద్దగా మద్దతు లభించకపోవడంతో తదుపరి కార్యాచరణ ఏంటి అనే దానిపై కూడా ఈ బేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకు తగ్గట్లుగానే టిఎస్ కమలనాథులకు అమిత్ షా సలహాలు సూచనలు ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. మరి బీజేపీని బలపరిచేందుకు అమిత్ షా ఎలాంటి వ్యూహాలు రచిస్తారో చూడాలి.
ఇవి కూడా చదవండి…