విదేశీ విద్యార్థులకు అమెరికా షాక్

9
- Advertisement -

విదేశీ విద్యార్థులకు అమెరికా షాకిచ్చింది. వీసాలపై ఎన్నాళ్లయినా అమెరికాలో ఉంటామంటే కుదరదని తేల్చి చెప్పింది హోంల్యాండ్ సెక్యూరిటీ. విదేశీ విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్ల డ్యూరేషన్ ఆఫ్ స్టేపై లిమిట్ విధించారు. అలాగే ఇమిగ్రేషన్ నిబంధనల్లో మార్పులకు సిద్ధమైంది అమెరికా. ట్రంప్ షాక్‌తో ఆరువేలకు పైగా విదేశీ విద్యార్థుల వీసాలు రద్దు కానున్నాయి.

ఈ వీసాల రద్దు వెనుక ఉన్న ప్రధాన కారణాలను అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ నేరాల్లో ఎక్కువగా దాడులు, డ్రక్ అండ్ డ్రైవ్, దొంగతనం వంటి చిన్నచిన్న నేరాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. మరో రెండు నుంచిమూడువందల వీసాలను టెర్రరిస్ట్ గ్రూపులకు మద్దతు ఇస్తున్నారన్న ఆరోపణలతో రద్దు చేశారు. అయితే, ఏ గ్రూపులకు మద్దతు ఇచ్చారనే వివరాలను అధికారులు వెల్లడించలేదు.

ట్రంప్ వలసవాదులపై ఉక్కుపాదాన్ని మోపుతూ, కఠిన చర్యలు తీసుకోవడం వల్ల అమెరికాలో చదువుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావాన్నిచూపుతున్నది. ప్రముఖ యూనివర్సిటీలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎలాంటి కారణాలు చూపకుండా, చిన్నపాటి తప్పులకు కూడా వీసాలు రద్దు చేయడంసరికాదని యూనివర్సిటీలు అంటున్నాయి. మొత్తంగా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో విదేశీ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

Also Read:భారీ వర్షాలు..ప్రజల మధ్యలో బీఆర్ఎస్‌!

- Advertisement -