భారత్‌పై అమెరికా ప్రశంసలు!

217
america
- Advertisement -

భారత్‌పై ప్రశంసలు గుప్పించింది అమెరికా. భారత్ తమకు నిజమైన స్నేహితుడని పేర్కొంది బ్యూరో ఆఫ్ సౌత్, సెంట్రల్ ఆసియా వ్యవహారాల యూఎస్ స్టేట్ డిపార్టమెంట్‌ . దక్షిణాసియా దేశాలకు ఉచితంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తూ ప్రపంచ ఆరోగ్యాన్ని సంరక్షించడంలో భారత్‌ పాత్రను అమోఘం అన్నారు.

నేపాల్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, మాల్దీవులతో పాటు పొరుగు దేశాలకు భారత్‌ వ్యాక్సిన్లను ఉచితంగా సరఫరా చేస్తోంది. ఇప్పటికే దేశంలో కరోనా వైరస్‌ టీకా డ్రైవ్‌ను ప్రారంభించింది. డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా కోవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ వ్యాక్సిన్లకు దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది.

భూటాన్‌కు 1.50లక్షల డోసులు, మాల్దీవులకు లక్ష డోసులు, బంగ్లాదేశ్‌కు రెండు 20లక్షలు, నేపాల్‌కు పది లక్షల డోసులను ఉచితంగా పంపింది. అలాగే మయన్మార్‌తో పాటు షీసెల్స్‌ దేశాలకు వ్యాక్సిన్‌ను అందజేయనుంది.

- Advertisement -