వీసా గడువు ముగిసినా అమెరికాలో ఉంటే బహిష్కరణతో పాటు శాశ్వతంగా అనర్హత వేటు వేస్తామని అమెరికా దౌత్య కార్యాలయం తెలిపింది. వీసా నిబంధనలు గౌరవించాల్సిందే లేదంటే చర్యలు తప్పవని అగ్రరాజ్యం ఎంబసీ వార్నింగ్ ఇచ్చింది.
అలాగే బిజినెస్, టూరిస్ట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు పూచీకత్తు కింద 15వేల డాలర్ల వరకు బాండ్ చెల్లించాలని ఆ దేశ విదేశాంగశాఖ ప్రతిపాదించింది. 12 నెలల పైలట్ ప్రోగ్రామ్ కింద ఈ కొత్త నిబంధన తీసుకురానున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. బీ-1 (బిజినెస్), బీ-2 (టూరిస్ట్) వీసాలపై ఈ నిబంధన తీసుకురానున్నట్లు తెలిపింది.
అయితే, ఈ బాండ్ నిబంధన అన్ని దేశాల ప్రజలకు ఉండదని వివరించింది. షూరిటీ వర్తించే దేశాల జాబితాను అమెరికా విదేశాంగ శాఖ త్వరలోనే ప్రకటించనుంది. ఈ ప్రోగ్రామ్‌లో మొత్తం 42 దేశాలు ఉండగా, అందులో మెజార్టీ ఐరోపా దేశాలు కాగా ఆసియా, మధ్యప్రాచ్యం నుంచి కొన్ని దేశాలున్నాయి.
Also Read:ఇండియాతో ఓటమి బాధించింది!

