అమెరికా..ప్రపంచ సూపర్ పవర్‌

3
- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. రెండు సంవత్సరాల క్రితం అమెరికన్ ప్రజలు దేశాన్ని రక్షించేందుకు తమకు స్పష్టమైన తీర్పు ఇచ్చారని ఆయన వెల్లడించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల కంటే ఎక్కువే పూర్తి చేశామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

తన ప్రసంగంలో ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ట్రంప్, గత పాలకులు అమెరికా చరిత్రలోనే అత్యంత ఘోరమైన ద్రవ్యోల్బణాన్ని సృష్టించారని ఆరోపించారు. అంతేకాకుండా వారి విధానాల వల్ల అమెరికా నగరాలు విధ్వంసం దిశగా నెట్టబడ్డాయని మండిపడ్డారు.

తమ ప్రభుత్వ హయాంలో సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ.. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద పన్ను కోతలను (Tax Cuts) అమలు చేశామని తెలిపారు. సైనిక (మిలిటరీ), ఇంధన (Energy) రంగాల్లో రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా అమెరికాను ప్రపంచంలోనే తిరుగులేని శక్త్యుపాసక ‘సూపర్ పవర్’గా తీర్చిదిద్దామని ట్రంప్ స్పష్టం చేశారు.

Also Read:అసెంబ్లీ ఘటనపై ఢిల్లీకి బీఆర్‌ఎస్ బృందం

- Advertisement -