అమెరికాలో మళ్లీ పేలిన తుపాకీ…12 మంది మృతి

217
america
- Advertisement -

అమెరికాలో మరోసారి గన్ కల్చర్ భగ్గుమంది. వేర్వేరు చోట్ల జరిపిన కాల్పుల్లో 12 మంది మృతిచెందారు. కొలరాడో పార్క్ లో పుట్టిన రోజు వేడుకల్లో ఆదివారం అర్థరాత్రి ఓ దుండగుడు కాల్పులు జరపగా ఏడుగురు మృతిచెందారు.

ఉడ్‌ల్యాండ్‌లో పొరుగువారిపై ఓ వ్యక్తి కాల్పులు జరుపడంతో ముగ్గురు మృతి చెందారు. నిందితుడిపై పోలీసులు ఎదురుకాల్పులు చేయగా.. దుండగుడు ప్రాణాలు కోల్పోయాడు. వరుస కాల్పుల ఘటనలతో స్ధానికంగా కలకలం చోటుచేసుకుంది.

- Advertisement -