అమెరికాలో మళ్లీ టిక్‌టాక్‌..!

7
- Advertisement -

అమెరికాలో మళ్లీ టిక్ టాక్ దర్శనమివ్వనుంది. టిక్‌టాక్‌పై ఉన్న బ్యాన్‌ను ఎత్తేయాలని యోచిస్తోంది ట్రంప్ యంత్రాంగం. ఈ విషయమై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మాట్లాడతానని తెలిపారు ట్రంప్.

టిక్‌టాక్‌ మళ్లీ వస్తే అమెరికా యువత చాలా సంతోషిస్తుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు ట్రంప్.అమెరికా ఖజానా కార్యదర్శి స్కాట్‌ బెసెంట్‌ మాడ్రిడ్‌లో జరిగిన వాణిజ్య చర్చల అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “టిక్‌టాక్‌ ఒప్పందానికి ఫ్రేమ్‌వర్క్‌ సిద్ధమైంది. వాణిజ్య పరమైన నిబంధనలు గోప్యంగానే ఉంటాయి. ఇది రెండు ప్రైవేట్‌ పక్షాల మధ్య ఒప్పందం, కానీ ముఖ్య వాణిజ్య అంశాలు ఖరారయ్యాయి” అని తెలిపారు.

ఈ ఒప్పందాన్ని విజయవంతంగా కుదిపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యక్తిగతంగా జోక్యం చేసుకున్నారని బెసెంట్‌ తెలిపారు. ట్రంప్‌ త్వరలోనే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో నేరుగా మాట్లాడి, ఈ ఏడాది చివర్లో జరిగే శిఖరాగ్ర సమావేశానికి ముందే ఒప్పందాన్ని ఖరారు చేసే అవకాశముంది. గతంలో అమెరికా కాంగ్రెస్‌ ఆమోదించిన చట్టం ప్రకారం బైట్‌డాన్స్‌ తొమ్మిది నెలల్లో టిక్‌టాక్‌ అమెరికా కార్యకలాపాలను విక్రయించకపోతే నిషేధం తప్పదని స్పష్టం చేసింది. ఆ గడువు ప్రారంభానికి ముందే ఈ ఏడాది జనవరి 18న టిక్‌టాక్‌ తాత్కాలికంగా అమెరికాలో నిలిపివేయబడింది. అయితే, ట్రంప్‌ తన పదవి స్వీకరించిన తొలి రోజే ఆ చట్టం అమలును 75 రోజుల పాటు వాయిదా వేశారు. అనంతరం ఆయన రెండు సార్లు గడువు పొడిగించి, చివరగా సెప్టెంబర్‌ 17 వరకు విధించారు.

Also Read:రైల్వే రిజర్వేషన్‌లో కీలక మార్పులు

- Advertisement -