ఐటీ రైడ్స్‌పై సోనూ సూద్..

64
sonu

సోనూ సూద్ దాదాపు రూ. 20 కోట్ల పన్ను ఎగవేశారని ఐటీ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలిసారి ఐటీ రైడ్స్‌పై స్పందించారు సోనూ. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి కూడా నిరుపేద‌ల జీవితాల కోసం పోగు చేసిందే. మాన‌వ‌తా కార‌ణాల‌తో కొన్ని బ్రాండ్ల‌ను సైతం ప్రోత్సహించాను. నాలుగు రోజులుగా నేను నా అతిథులు( ఐటీ అధికారులు)తో బిజీగా ఉన్నాను. ఆ కార‌ణం వ‌ల్ల‌నే మీ సేవ‌లోఉండ‌లేక‌పోయాను. ఇప్పుడు తిరిగి వ‌చ్చాను అంటూ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు సోనూసూద్‌.

సోనూసూద్‌ ఆస్తులపై ఐటీ సోదాలు జ‌రిగిన విష‌యం తెలిసిందే. ముంబయిలోని ఆయన నివాసంతోపాటు గ్‌పూర్‌, జైపుర్‌లలో ఏకకాలంలో సోదాలు నిర్వ‌హించారు. సోనూ సూద్‌ ఛారిటీ ఫౌండేషన్‌ బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలించారు. దాడులు పూర్తైన త‌ర్వాత ఐటీ అధికారులు సోనూసూద్.. ​ రూ.20 కోట్లకు పైగా ట్యాక్స్​ ఎగ్గొట్టాడని వెల్లడించారు .