అంబాజీపేట మ్యారేజి బ్యాండు..రిలీజ్ డేట్

64
- Advertisement -

సుహాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “అంబాజీపేట మ్యారేజి బ్యాండు”. ఈ సినిమాలో మ్యారేజ్ బ్యాండ్ లీడర్ మల్లి క్యారెక్టర్ లో సుహాస్ కనిపించనున్నారు. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు.

కామెడీ డ్రామా కథతో తెరకెక్కుతున్న”అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా రిలీజ్ డేట్ ను ఇవాళ మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాను ఫిబ్రవరి 2న గ్రాండ్ గా థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. వైవిధ్యమైన కథా కథనాలతో తెరకెక్కిన “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” మూవీ థియేటర్స్ లో ఆడియెన్స్ కు యూనిక్ ఎక్సీపిరియన్స్ ఇస్తుందని చిత్రబృందం ఆశిస్తున్నారు.

Also Read:టీఎస్‌పీఎస్సీపై సీఎం రేవంత్

- Advertisement -