తెలంగాణలో అమెజాన్ రూ.60 వేల కోట్ల పెట్టుబడులు

1
- Advertisement -

దావోస్ వేదికపై తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. అమెజాన్ తో భారీ ఒప్పందం చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం. రూ.60 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది అమెజాన్.

దావోస్‌లో పెట్టుబడుల సమీకరణలో ఇప్పటికే కొత్త రికార్డు నెలకొల్పొంది తెలంగాణ ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్‌లో అతి పెద్ద పెట్టుబడి ఒప్పందం కుదర్చుకుంది.

హైదరాబాద్‌లో రూ.60,000 కోట్లు పెట్టుబడికి అమెజాన్ కంపెనీ అంగీకారం తెలిపింది. డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబుతో అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పుంకే భేటీ అయ్యారు.

తెలంగాణలో తన క్లౌడ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి 2030 నాటికి 4.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఇప్పటికే ప్రకటించింది అమెజాన్ వెబ్ సర్వీసెస్.

Also Read:KTR:రేవంత్ రెడ్డికి కేటీఆర్ చురకలు

- Advertisement -