అమెజాన్ ఉద్యోగులకు తీపి కబురు..

210
Amazon
- Advertisement -

కరోనా వైరస్‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలు కుదేలైపోయాయి. దీంతో పలు కంపెనీలలో ఉద్యోగుల్లో కోతలు విధిస్తుంటే. ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కరోనా సంక్షోభంలోనూ పనిచేస్తున్న ఉద్యోగులందరికీ బోనస్‌ ప్రకటించింది. ఇందుకోసం 500 మిలియన్‌ డాలర్లు అంటే దాదాపు రూ.3,775 కోట్లు ఒకేసారి చెల్లిస్తామని వెల్లడించింది.

కరోనా కష్టకాలంలోనూ అమెజాన్ సేవలందించిందని సంస్థ తెలిపింది. ఇందులో ఫ్రంట్ లైన్ ఉద్యోగుల పాత్ర ముఖ్యమని స్పష్టం చేసింది అమెజాన్. జూన్‌ వరకు పనిచేసిన ఉద్యోగులు, భాగస్వాములు ఒక్కొక్కరు 150 డాలర్లు అంటే రూ11,300 నుంచి 3000 డాలర్లు అంటే రూ.2.26 లక్షల వరకు బోనస్‌గా చెల్లిస్తామని అమెజాన్‌ తెలిపింది.

ప్రపంచంలోనే అతిపెద్ద ఈ కామర్స్ కంపెనీ అయిన అమెజాన్ ఏటా 10 బిలియన్‌ వస్తువులను వినియోగదారుల‌కు చేర‌వేస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రబలడంతో అమెజాన్‌ బిజెనెస్‌పై ప్ర‌భావం ప‌డింది. ఆర్డ‌ర్లు బాగా త‌గ్గిపోవ‌డంతో అనుకున్న మేర‌కు లాభాలు మూట‌గ‌ట్టుకోలేక పోయింది. అయినాస‌రే, కష్ట‌కాలంలో సంస్థ కోసం ప‌నిచేసిన త‌న ఉద్యోగుల‌కు బోన‌స్ ఇచ్చేందుకు సిద్ధ‌మైంది.

- Advertisement -