కరోనా సెకండ్ వేవ్‌పై పోరాటంలో భాగంగా అమెజాన్ ఇండియా ముందుకొచ్చింది. ఏసీటీ గ్రాంట్స్, టెమాసెక్ ఫౌండేషన్ పుణె ప్లాట్‌ఫామ్ ఫర్ కొవిడ్-19 రెస్పాన్స్‌లతో చేతులు కలిపి అత్యవసరంగా సింగపూర్ నుంచి 8 వేల ఆక్సిజన్ కాన్సెన్‌ట్రేటర్‌లను తీసుకొస్తోంది.
వీటిని దేశవ్యాప్తంగా ఉన్న ఆయా కొవిడ్ హాస్పిటల్స్‌కు డొనేట్ చేయనున్నారు. ఈ మెషీన్లను ఇండియాకు తీసుకురావడానికి అయ్యే విమాన ఖర్చులను మొత్తం అమెజాన్ ఇండియా భరించనుంది. ఎయిరిండియాతోపాటు ఇతర విమాన సర్వీసుల్లో ఇవి ఇండియాకు రానున్నాయి.
కరోనా వల్ల ఇండియా ఊహించని రీతిలో ప్రభావితమైందని అమెజాన్ ఇండియా గ్లోబల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ తెలిపారు. ఈ కష్ట సమయంలో మేము దేశానికి అండగా ఉంటాం….. అందులో భాగంగానే ఆక్సిజన్ కాన్సెన్‌ట్రేటర్‌లను సింగపూర్ నుంచి ఎయిర్‌లిఫ్ట్ చేయనున్నామని వెల్లడించింది.