తెలంగాణలో అమెజాన్ 20వేల 761 కోట్ల పెట్టుబడులు: కేటీఆర్

198
amazon
- Advertisement -

మంత్రి కేటీఆర్ చొరవతో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టగా తాజాగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు మంత్రి కేటీఆర్.

అమెజాన్ వెబ్ సర్వీసెస్(AWS) తెలంగాణలో రూ, 20,761 కోట్లు(2.77 బిలియన్ డాలర్ల) పెట్టుబడి పెట్టనుందని వెల్లడించారు కేటీఆర్. 2022 వరకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ మల్టీపుల్ డేటా సెంటర్లు హైదరాబాద్‌లో ప్రారంభంకానున్నాయని వెల్లడించారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ పెట్టుబడుల పట్ల మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.హైద‌రాబాద్ న‌గ‌రం కొత్త మైలురాయిని అందుకుంద‌ని…తెలంగాణ చరిత్రలోనే ఇది అతిపెద్ద పెట్టుబడి అని తెలిపారు కేటీఆర్.

- Advertisement -