యూ ట్యూబ్‌ ట్రెండింగ్‌లో విజేత..

567
vijetha
- Advertisement -

మెగా స్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘విజేత’ . చిరు కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన విజేత మూవీ టైటిల్‌తో వచ్చిన ఈ సినిమాను వారాహి చలనచిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి నిర్మించారు. రాజీవ్ కనకాల , సత్యం రాజేష్ , సుదర్శన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాలో మాళవిక నాయర్ కథానాయికగా నటించింది . సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల జరిగిన ఆడియో వేడుకకు చిరంజీవి,రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఇక ఫస్ట్ లుక్‌తో ఆకట్టుకున్న కల్యాణ్ దేవ్‌ ట్రైలర్‌తో మెస్మరైజ్ చేశాడు. ట్రైలర్‌లో రొమాన్స్‌,ఫ్యామిలీ ఎమోషన్‌,యాక్షన్‌ సీన్స్ కలగలిపి తెరకెక్కించారు. తండ్రీ కొడుకుల మధ్య ఉంటే ఎమోషన్స్ సీన్, సంభాషణలు మనసును ఆకట్టుకునేలా ఉంది. అక్కడక్కడా కళ్లు చెమర్చేలా ఉంది.  జూలై 12న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బాహుబలి చిత్రానికి చాయాగ్రాహకుడిగా పనిచేసిన సెంథిల్ కుమార్ ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశాడు . హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. విజేత ఓ మధ్యతరగతి ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకురానుంది.

- Advertisement -