నిక్ గురించి మధు చోప్రా ఏమన్నారంటే..?

227
Priyanka, , Nik,

బాలీవుడ్ అందాల తార ప్రియాంక చోప్రా గత కొంతకాలం అమెరికన్ సింగర్ నిక్ జొనాస్ తో ప్రమాయణం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జంట ఇండియాలో షికారు చేస్తోంది. ముంబై బీటౌన్ లో ఈ ఇద్దరి పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ఇటీవలె ముంబైలోని నూతన ఇంటి గృహప్రవేశానికి లవర్ నిక్ ని ప్రియాంక ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ప్రియాంక నిక్ ను తన తల్లికి మధు చోప్రాకు పరిచయం చేసింది.

Nick-Jonas

ఈ నేపథ్యంలో నిక్ తో పాటు, ప్రియాంక, ఆమె తల్లి ఓ రెస్టారెంట్ లో డిన్నార్ కి వెళ్లారు. డిన్నర్ అనంతరం ప్రియాంక తల్లిని, నిక్ జొనాస్ గురించి మీడియా అడగగా.. డిన్నర్ కోసం వచ్చామని, కానీ ఇక్కడ అందరూ నిక్ చుట్టూ చేరడంతో అతనితో మాట్లాడడం కుదరలేదని చెప్పారు. అయినా తక్కువ సమయంలోనే అతనిపై ఎలాంటి అభిప్రాయానికి రాలేనని అన్నారు. ఓ విదేశియుడితో తన కూతురు పెళ్లి చేయడానికి తాను సిద్దంగా లేనని గతంలో ప్రియాంక తల్లి పేర్కొన్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ప్రియాంక చోప్రాను నిక్ తన ఫ్యామిలీకి పరిచయం చేశారు. నిక్ తరపు బంధువుల పెళ్లికి కూడా ప్రియాంక వెళ్లి వచ్చారు. ప్రియాంక కంటే 11 ఏళ్లు చిన్న వాడైనా నిక్ ని ఆమె పెళ్లి చేసుకోనుందో..? లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.