అమర్‌నాథ్ యాత్ర..ఈసారి 57 రోజులు

2
- Advertisement -

జమ్మూ కాశ్మీర్‌లోని పవిత్ర అమర్‌నాథ్ యాత్ర శుక్రవారం (జూలై 3) ఘనంగా ప్రారంభమైంది. జమ్మూలోని భగవతి నగర్ యాత్రికుల బేస్ క్యాంప్ నుంచి తొలి విడత భక్తులను జమ్మూ-కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ Manoj Sinha జెండా ఊపి ప్రారంభించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య “బమ్ బమ్ భోలే”, “హర్ హర్ మహాదేవ్” నినాదాలతో భక్తులు యాత్రను ప్రారంభించారు.

ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర మొత్తం 57 రోజుల పాటు కొనసాగనుంది. జూలై 3న ప్రారంభమైన యాత్ర ఆగస్టు 28న రక్షాబంధన్ రోజున ముగియనుంది.హిమాలయాల్లో సముద్ర మట్టానికి సుమారు 12,700 అడుగుల ఎత్తులో ఉన్న అమర్‌నాథ్ గుహలో సహజ సిద్ధంగా ఏర్పడే హిమలింగాన్ని దర్శించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఈసారి ఇప్పటికే సుమారు 4 లక్షల మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

భక్తులు పహల్గామ్ మరియు బాల్టాల్ అనే రెండు మార్గాల ద్వారా గుహ ఆలయానికి చేరుకోవచ్చు. యాత్రకు ముందస్తు రిజిస్ట్రేషన్, తప్పనిసరి ఆరోగ్య ధ్రువీకరణ పత్రం (Medical Fitness Certificate), RFID నమోదు వంటి ఏర్పాట్లు చేశారు. ఇటీవలి భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర, జమ్మూ-కాశ్మీర్ ప్రభుత్వాలు యాత్ర మార్గమంతా భారీ భద్రతా బలగాలను మోహరించాయి. వైద్య శిబిరాలు, అత్యవసర సహాయక బృందాలు, రవాణా, వసతి తదితర సౌకర్యాలను కూడా విస్తృతంగా ఏర్పాటు చేశారు.

Also Read:EPFO సంచలన నిర్ణయం

- Advertisement -