బీజేపీలోకి పంజాబ్ మాజీ సీఎం

86
bjp
- Advertisement -

పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఇవాళ బీజేపీలో చేరనున్నారు. ఢిల్లీలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకోనుండగా ఆయన పార్టీ(పంజాబ్ లోక్ కాంగ్రెస్‌)ను బీజేపీలో విలీనం చేయనున్నారు. అమరీందర్‌తో పాటు కుమారుడు రణ్ ఇందర్ సింగ్, కుమార్తె ఇందెర్ కౌర్, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ కూడా కాషాయ కండువ కప్పుకుంటున్నారు.

రెండుసార్లు పంజాబ్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు అమరీందర్ సింగ్. గత ఎన్నికల ముందు పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శిరోమణి అకాలీ దళ్ (సంయుక్త్)తో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగారు. కానీ అమరీందర్ సింగ్‌తో పాటు ఆ పార్టీ అభ్యర్థులంతా ఓడిపోయారు.

- Advertisement -