ప్రముఖ దర్శకులతో ‘అమరం అఖిలం ప్రేమ’ టీజర్..

262
sukukar
- Advertisement -

సుకుమార్ గుర్తించిన యంగ్ టాలెంటెడ్ టీమ్ అంటే తప్పకుండా వీరిలో వున్న ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమరం అఖిలం ప్రేమఅనే ఈ టైటిల్ చాలా పాజిటివ్‌గా వుంది. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. సుకుమార్ ఆధ్వర్యంలో రూపొందిన ఈ సినిమా తప్పకుండా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం వుంది అన్నారు ప్రముఖ దర్శకుడు కొరటాల శివ. విజయ్‌రామ్, శివశక్తి సచ్‌దేవ్ జంటగా జోనాథన్ ఎడ్వర్డ్స్ దర్శకత్వంలో వీఆర్ చలనచిత్రాలు పతాకంపై వీఈవీకేడీఎస్ ప్రసాద్ నిర్మించిన చిత్రం అమరం అఖిలం ప్రేమ. ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్‌తో కలిసి కొరటాల శివ ఆవిష్కరించారు.

Amaram Akhilam Prema Movie

ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ.. ఈ చిత్ర నిర్మాత ప్రసాద్‌తో నాది 20 ఏళ్ళ ప్రయాణం. లెక్చరర్స్‌గా ఇద్దరం కలిసి పనిచేశాం. ప్రసాద్ ఈ చిత్రంతో నిర్మాతగా మారటం ఆనందంగా వుంది. విజయ్ రామ్‌ను హీరోగా చూడాలనేది ఆయన తండ్రి కోరిక. నటుడిగా అన్ని రకాల ఎమోషన్స్ పండించడమే ఓ హీరోకు కావాల్సిన అర్హత. అది విజయ్‌రామ్‌లో వుంది. ఈ చిత్ర దర్శకుడు జోనాథన్ నాకు చాలా ఏళ్ళ నుండి తెలుసు. ఎంతో ప్రతిభావంతుడైన దర్శకుడు. రసూల్ ఎల్లోర్ విజువల్స్ అద్భుతంగా వున్నాయి. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది అని తెలిపారు.

సుకుమార్ తనను గుర్తించి హీరోగా ఎంకరేజ్ చేశారని హీరో విజయ్‌రామ్ తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ.. సుకుమార్ లేకపోతే ఈ రోజు నేను దర్శకుడిగా మీ ముందు వుండేవాడ్ని కాదు. మొదట్నుంచీ ఆయన ప్రోత్సాహం ఎంతో వుంది. ఎంతో వ్యయ ప్రయాసాలతో నిర్మాత ప్రసాద్ ఈ చిత్రాన్ని రాజీపడకుండా నిర్మించారు. బొమ్మరిల్లుతో జెనీలియాకు ఎంత మంచి పేరు వచ్చిందో ఈ చిత్ర నాయిక శివశక్తికి ఈ చిత్రంతో అంత పేరు వస్తుంది అన్నారు.

Amaram Akhilam Prema Movie

నిర్మాత మాట్లాడుతూ.. నా మీద ప్రేమతో ఈ వేడుకకు విచ్చేసి, మమ్ములను ప్రోత్సాహిస్తున్న సుకుమార్, కొరటాల శివకు నా కృతజ్ఞతలు. తప్పకుండా ఈ చిత్రం అందరి ప్రశంసలు పొందుతుందనే నమ్మకం వుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కెమెరామెన్ రసూల్ ఎల్లోర్, సంగీత దర్శకుడు రథన్, నటుడు శ్రీకాంత్, మాటల రచయిత శ్రీకాంత్ విస్సా, జక్కా హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Amaram Akhilam Prema Movie Teaser Launched By Directors Sukumar and Koratala Shiva..

- Advertisement -