‘ఎంత మంచివాడవురా’ నుంచి తొలి పాట..

293
kalyan ram
- Advertisement -

నందమూరి కళ్యాణ్‌రామ్‌, మెహరీన్‌ జంటగా భారీగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎంత మంచివాడవురా’. ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని విడుదలకు ముస్తాబవుతోంది. ఈ మూవీ నుంచి తొలి సాంగ్ విడుదలైంది. ‘ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో.. ఓ కొంచెం పాలు పంచుకుందాం..’ అంటూ సాగిన ఈ పాటను చిత్రయూనిట్ ఇవాళ విడుదల చేసింది.

ఈ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించగా గోపీ సుందర్ సంగీతం అందించారు. సతీశ్ వేగేశ్న దర్వకత్వంలో రూపొందుతున్న ‘ఎంత మంచివాడవురా’ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కల్యాణ్ రామ్ సరసన మెహరీన్ నటిస్తోంది. శరత్ బాబు, సుహాసిని, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్, రాజీవ్ కనకాల తదితరులు ఈ చిత్రంలో నటించారు.

https://youtu.be/RNNTngghBCU

Nandamuri Kalyanram’s Entha Manchivaadavuraa 1st Single

- Advertisement -