అక్బర్ అమర్ ఆంటోని … సెన్సార్ టాక్

278
raviteja
- Advertisement -

ర‌వితేజ‌, ఇలియానా జంట‌గా న‌టిస్తున్న చిత్రం అమ‌ర్ అక్బర్ ఆంటోనీ.శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 16న ప్రేక్షకుల ముందుకురానుంది. సినిమా ప్రమోషన్స్‌,టీజర్‌తో అంచనాలను పెంచేసిన రవితేజ అంచనాలను పెంచేశాడు. గతంలో శ్రీను వైట్ల-రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన నీ కోసం,వెంకీ,దుబాయ్ శీను బాక్సాఫీస్ ముందు సత్తాచాటాయి. దీంతో మరోసారి వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమాపై టాలీవుడ్‌ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

మూవీ ప్రీ రిలీజ్‌లో భాగంగా నేడు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఏ సర్టిఫికేట్‌ను అందుకుంది. యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ మూడు పాత్రల్లో నటిస్తున్నారు. మూవీపై సెన్సార్ సభ్యుల ప్రశంసలు కురిపించారు. మూడుభిన్నమైన పాత్రల్లో రవితేజ ఆకట్టుకున్నారని చిత్రయూనిట్‌కి సెన్సార్ సభ్యులు బెస్ట్ విషెస్ చెప్పినట్లు సమాచారం.

ల‌య‌, సునీల్, వెన్నెల కిషోర్, ర‌ఘు బాబు,త‌ రుణ్ అరోరా, అభిమ‌న్యు సింగ్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. తమ‌న్ సంగీతం అందిస్తుండ‌గా.. వెంక‌ట్ సి దిలీప్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు.

- Advertisement -