నేనూ.. కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నా-ఆమని

312
amani
- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ పై నటి శ్రీరెడ్డి ఆరోపణల అనంతరం, చాలా మంది నటీమణులు వారు ఎదుర్కొన్న వేధింపుల గురించి చెప్తూ వస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో ఒకప్పటి టాప్ హీరోయిన్ ఆమని చేరిపోయారు. తాను కూడా లైగింగ వేధింపులు ఎదుర్కొన్నానని చెప్పారు.

Aamani

కెరీర్ ప్రారంభంలో కాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదర్కొన్నానని చెప్పింది. కొత్త కంపెనీల వలనే నేను కాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదుర్కొన్నానని అన్నారు. ఫోటోలు చూసి ఫోన్ చేసే వారని, చాలా బాగున్నావ్, రేపు ఒకసారి గెస్ట్ హౌజ్ కి రావాలనే వారు, మేకప్ టెస్ట్ చేయాలని చెప్పేవాలని చెప్పింది. అయితే మీ అమ్మగారిని మాత్రం ఇక్కడికి తీసుకురావద్దంటూ చెప్పేవారు. మా అమ్మగారిని వెంట తీసుకురావద్దు అనగానే వీళ్లు ఆ బ్యాచ్ వాళ్లనే విషయం అర్థమయ్యేది అంటూ చెప్పుకొచ్చింది.

ఈ సమస్య కేవలం కొత్త కంపెనీలతో మాత్రమే ఎదురైందని, ప్రొఫెషనల్ సంస్థలు, నిర్మాతల నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ ఈసమస్య ఎదురుకకాలేదని చెప్పింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది ఆమని. సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంతమేరకు సక్సెస్ అవుతారో చూడాలి ఇక.

- Advertisement -