మరోసారి వెంకటేశ్ సరసన అమలాపాల్

678
Narappa Amalapaul

విక్టరీ వెంకటేశ్ ఇటివలే వెంకీమామ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం వెంకటేశ్ తమిళ్ విజయం సాధించిన అసునన్ రీమేక్ లో నటిస్తున్నాడు. ఈమూవీకి నారప్ప అనే టైటిల్ ను ఖారారు చేశారు. ఇటివలే వెంకటేశ్ ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు చిత్రయూనిట్. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ అనంతపురం పరిసరాల్లో జరుగుతుంది.

ఇక ఈమూవీలో వెంకటేశ్ సరసన ప్రియమణి నటిస్తుండగా, మరో కథానాయికగా అమలాపాల్ ను తీసుకున్నారు. త్వరలోనే అమలాపాల్ షూటింగ్ లో జాయిన్ కానుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈమూవీని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. కాగా ఇటివలే విడుదలైన ఫస్ట్ లుక్ ఆసక్తిరేపుతోంది. వెంకటేశ్ కొత్త లుక్ లో ఆకట్టుకుంటున్నాడు. తమిళ్ లో ధనుష్ హీరోగా నటించిన ఈమూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.