అమ్మడు మళ్లీ పెళ్లి చేసుకుంటుందట!

73
- Advertisement -

చరణ్ హీరోగా వచ్చిన నాయక్ సినిమాను అంత త్వరగా ఎవ్వరూ మర్చిపోలేరు. మెగా ఫ్యాన్స్ లో ఈ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. భారీ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఒక హీరోయిన్ అమలాపాల్ అప్పట్లో కుర్రాళ్ళ క్రష్. అమలాపాల్ అందంకు కుర్రాలంతా ఫిదా అయ్యారు. బ్లాక్ అండ్ డస్కీ బ్యూటీ అమలాపాల్ కి ఫుల్ క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ తో ఈ భామ తెలుగు తమిళ్ భాషల్లో కొన్నాళ్ళు పాటు ఒక వెలుగు వెలిగింది.

ఐతే, ఫామ్ లో ఉన్న సమయంలోనే దర్శకుడు ఎ.ఎల్. విజయ్ ను అమలాపాల్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత సినిమాలకు దూరం అయ్యింది. అయితే పెళ్లి తర్వాత తన భర్తతో విభేదాలు రావడంతో అమలాపాల్ విజయ్ నుంచి విడిపోయారు. అప్పటి నుంచి ఆమె సింగిల్ గానే ఉంటున్నారు. తాజాగా అమలాపాల్ రెండో వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన అమలాపాల్ ప్రస్తుతం వెబ్ సిరీస్ ల్లో నటిస్తున్నారు.

అయితే తాజాగా అమలాపాల్ తాను రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది. సరైన సమయం వస్తే రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమేనని చెప్పుకొచ్చింది. నన్ను రెండో పెళ్లి చేసుకునే వ్యక్తి కొరకు నేను ఎదురుచూస్తున్నాను అని, సరైన వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటానని.. అసలు ఇంకెన్ని రోజులు పెళ్లి చేసుకోకుండా ఈ విధంగా ఉంటానో నాకే తెలియదు అంటూ తనలోని పెళ్లి కోరికను అమలాపాల్ ఓపెన్ గా చెప్పేసింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -