బ్లాక్ బ్యూటీ అమలాపాల్ పేరు గత రెండు మూడు నెలల నుంచి హాట్ టాపిక్ మారిన విషయం తెలిసిందే. పెళ్లైన ఏడాదికే విభేదాలతో భర్తతో విడాకులు తీసుకుని అందరి నోటా నానింది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే తాజాగా అమ్మడు మరో వార్తతో మీడియా దృష్టిని ఆకర్షించింది. కోలీవుడ్ యంగ్ హీరో, రజనీకాంత్ అల్లుడు ధనుష్ తో అమలాపాల్‌కు ఎఫైర్ ఉందనే వార్త హల్ చల్ చేస్తోంది. అయితే ఈ విషయాన్ని అమలాపాల్ ఖండించింది. తన భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత డిప్రెషన్ కు లోనయ్యానని… ఆ సమయంలో ధనుష్ ఓ స్నేహితుడిలా తనకు సహాయం చేశాడని చెప్పింది. తాను తన భర్తతో విడిపోకుండా ఉండేందుకు ధనుష్ చాలా ప్రయత్నించాడని…. అలాంటి వ్యక్తితో తనకు రిలేషన్ షిప్ ఉందంటూ ప్రచారం చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించింది. ఆడవాళ్లకు మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ అసహనం వ్యక్తం చేసింది.
వాస్తవానికి డైరెక్ట్ విజయ్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత అమలాపాల్ కు సినిమాల్లో అవకాశాలు రావడం కష్టమే అని అందరూ భావించారు. అయితే, ఊహించని విధంగా ఈ అమ్మడుకి పలు ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. అమ్మ కణుక్కు, వీఐపీ2, వాడా చెన్నై ఇలా అమలాపాల్‌కు ధనుష్ వరుస ఆఫర్లు ఇవ్వడంతో.. … వీరిద్దరి మధ్య ఏదో స్టార్ట్ అయిందనే పుకార్లు హల్ చల్ చేశాయి. ఈ నేపథ్యంలోనే, ధనుష్ తో తన సంబంధంపై అమలాపాల్ క్లారిటీ ఇచ్చింది.