నేను సిగ‌రేట్ తాగేవాడినిః అఖిల్ అక్కినేని

435
Akhil
- Advertisement -

హీరో అక్కినేని అఖిల్ న‌టించిన సినిమా మిస్ట‌ర్ మ‌జ్ను. జ‌న‌వ‌రి 25న విడుద‌లైన ఈచిత్రం డివైడ్‌ టాక్‌ రావటంతో ప్ర‌మోష‌స్స్ పై దృష్టి పెట్టాడు అఖిల్. సినిమా విజ‌యం సాధించ‌క‌పోయినా అఖిల్ న‌ట‌న‌కు మాత్రం మంచి మార్కులే వ‌చ్చాయి. దీంతో ప్ర‌మోష‌న్స్ కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉంటూ ప‌లు ఛాన‌ళ్ల‌కు ఇంట‌ర్యూలు ఇస్తున్నారు చిత్ర‌యూనిట్. తాజాగా ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.

Mr.-Majnu

తనకు స్మోకింగ్ అలవాటు ఉండేదని… ఇటీవలే దాన్ని వదిలేశానని చెప్పాడు. అంతేకాదు, ధూమపానాన్ని అందరూ వదిలేయాలని సూచించాడు. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈసినిమాలో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టించింది. అఖిల్ నాలుగో చిత్రాన్ని స్పోర్ట్స్ జోన‌ర్‌లో చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం. ‘మలుపు’ దర్శకుడు ‘సత్యస‌తో అఖిల్ మూవీ చేయనున్నట్టు తెలుస్తోంది. మార్చి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని స‌మాచారం.

- Advertisement -