‘రాక్షసుడు’ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్.. తన ఎనిమిదో చిత్రాన్ని ‘కందిరీగ’, ‘రభస’ చిత్రాల దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ రౌతు దర్శకత్వంలో చేస్తున్నారు.
సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుబ్రహ్మణ్యం గొర్రెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘అల్లుడు అదుర్స్’ అనే టైటిల్ ఖాయం చేశారు. ఏప్రిల్ 30న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
హిలేరియస్ ఎంటర్‌టైనర్స్ తీయడంలో సిద్ధహస్తునిగా పేరు తెచ్చుకున్న సంతోష్ శ్రీనివాస్ మరోసారి ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే స్క్రిప్టుతో ‘అల్లుడు అదుర్స్’ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. సినిమా చాలా బాగా వస్తున్నదనే ఆనందం యూనిట్ అందరిలో కనిపిస్తోంది.
ఈ సినిమా వేసవిలో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఆహ్లాదకరమైన వినోదం అందించడం ఖాయం. అంతేకాదు, యూత్ సహా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే అన్ని అంశాలూ ఈ చిత్రంలో ఉన్నాయి. టైటిల్ పోస్టర్‌లో చుట్టూ అమ్మాయిలతో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఆయన సరసన హీరోయిన్లుగా నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు.
ప్రకాష్ రాజ్, సోనూ సూద్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషిస్తోన్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా, చోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ప్రధాన తారాగణం:బెల్లంకొండ సాయిశ్రీనివాస్, నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్, ప్రకాష్ రాజ్, సోనూ సూద్, వెన్నెల కిశోర్,
సాంకేతిక బృందం:సంగీతం: దేవి శ్రీప్రసాద్,సినిమాటోగ్రఫీ: చోటా కె. నాయుడు,ఎడిటింగ్: తమ్మిరాజు,ఆర్ట్: అవినాష్ కొల్లా,యాక్షన్: రామ్-లక్ష్మణ్,పీఆర్వో: వంశీ-శేఖర్,సమర్పణ: గంజి రమేష్ కుమార్,నిర్మాత: సుబ్రహ్మణ్యం గొర్రెల,దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్ రౌతు,బ్యానర్: సుమంత్ మూవీ ప్రొడక్షన్స్