నిఖిల్ కోసం అల్లు అర్జున్ ?

96
- Advertisement -

నిఖిల్ సిద్దార్థ అప్ కమింగ్ మూవీ 18 పేజిస్ ఈ నెల 23న థియేటర్స్ లోకి రాబోతుంది. కార్తికేయ 2 తర్వాత నిఖిల్ -అనుపమ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన సాంగ్స్ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. రెండ్రోజుల్లో ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. అవతార్ 2 స్క్రీనింగ్ తో 18 పేజిస్ ట్రైలర్ ఎటాచ్ చేయనున్నారు.

అయితే ఈ సినిమాను ప్రమోషన్స్ లో ఇంకా వేగం పెరిగేందుకు స్టార్ హీరో సపోర్ట్ అందుకోబోతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా తీసుకొచ్చే పనిలో ఉన్నారు. గీతా ఆర్ట్స్ 2 సినిమా పైగా బన్నీ వాస్ నిర్మాత. ఈ రీజన్ చాలదు బన్నీ గెస్ట్ కి వచ్చేందుకు. ఆల్మోస్ట్ బన్నీ గెస్ట్ గా ఈవెంట్ ఫిక్సయింది. 19న హైదరాబాద్ లో ఈవెంట్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు.

త్వరలోనే బన్నీ గెస్ట్ అనే విషయం చెప్తూ మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్ చెప్పనున్నారు. మరి గీతా ఆర్ట్స్ 2 లో తెరకెక్కిన అన్ని సూపర్ హిట్ సినిమాలకు బన్నీ గెస్ట్ గా వచ్చాడు. ఆ సెంటిమెంట్ కూడా 18 పేజిస్ కి కలిసొచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి…

ఒక్క హిట్ట్…రెమ్యునరేషన్ పెంచిన హీరో

చరణ్ సినిమా కోసం ఎదురుచూస్తున్నాడట

గర్బసంచి తీసేశారు..కీర్తి ఎమోషనల్

- Advertisement -