డేటింగ్‌పై అల్లువారబ్బాయి షాకింగ్‌ కామెంట్స్!

301
- Advertisement -

మెగా హీరో అల్లు శిరీష్ కెరీర్ లో ఇంత వరకూ సరైన హిట్ ఒక్కటి కూడా పడలేదు. ఇటివలే ఆయన నటించిన సినిమాలు వరుసగా పరాజయాలవుతున్నాయి. రీసెంట్‌గా ఎబీసీడీతో కూడా ఫ్లాప్ అందుకున్నారు. అయితే తాజాగా అల్లు శిరీష్‌కు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సాధారణంగా హీరోలు తమ వ్యక్తిగత విషయాలు పంచుకోవడానికి ఇష్టపడరు. కాన ఈ అల్లువారి అబ్బాయి మాత్రం తన డేటింగ్‌కు సంబంధించిన విషయాన్ని బయటపెట్టి వార్తల్లో నిలిచారు. ఈ కాలంలో రిలేషన్ షిప్ లేకుండా ఎవ్వరూ ఉండరు. నేను కూడా డేటింగ్ చేశాను. బ్రేకప్ చెప్పిన తర్వాత అమ్మాయికే కాదు, అబ్బాయికి కూడా పెయిన్ ఉంటుందన్నారు. గతంలో తనకు 2-3 సీరియస్ రిలేషన్ షిప్స్ ఉండేవి కానీ అవన్నీ ఇప్పుడు బ్రేకప్ అయ్యాయి.

ఓ మంచి కుటుంబానికి చెందిన అమ్మాయితో చాన్నాళ్లు డేటింగ్ చేశాను. కానీ నేనే బ్రేకప్ చెప్పాను అని తెలిపారు శిరీష్. బ్రేకప్ నిర్ణయం కరెక్టా కాదా అని 3-4 నెలలు అనిపించిందని కానీ తాను తీసుకున్న నిర్ణయమే కరక్ట్ అన్నారు.

- Advertisement -