ఎయిర్‌ టెల్‌ బ్యాడ్‌… వోడాఫోన్‌ వరెస్ట్: అల్లు శిరిష్

273
Allu Sirish
- Advertisement -

అల్లు వారబ్బాయికి కోప మొచ్చింది. అదేదో తన సినిమా దర్శకుడిపైనో,సహా నటులపైనో కాదు. తాను వాడే మొబైల్ నెట్ వర్క్‌పై. కొంతకాలంగా ఎయిర్‌టెల్‌ నెట్‌ వర్క్‌పై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎయిర్‌ టెల్‌ నుంచి వోడా పోన్‌కు మారాడు హీరో అల్లు శిరీష్‌. అంతే పెనం మీద నుంచి పోయిలో పడ్డట్లు తయారైందట శిరీష్ పరిస్ధితి.

ఇదే అంశాన్ని ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన శిరీష్..దేని విలువైనా అది నీ దగ్గరున్నంత కాలం తెలియదు. ఈ మధ్యే ఎయిర్‌ టెల్ నుంచి వోడాఫోన్‌కి మారాను. నా పరిస్థితి బ్యాడ్ నుంచి వరస్ట్‌ అయింది..4జీ సంగతి మర్చిపోండి కనీసం 2జీ సిగ్నల్స్‌ కూడా అందడం లేదు. చాలా చింతిస్తున్నాను. ఓ పాఠం నేర్చుకున్నాను అని ట్వీట్ చేశారు. మరి శిరీష్ పెట్టిన పోస్టుపై వోడాఫోన్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

ప్రస్తుతం అల్లు శిరీష్ మలయాళంలో సూపర్ సక్సెస్ అందుకున్న ఎబిసిడి సినిమా రీమేక్ మూవీలో నటిస్తున్నాడు. శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోండగా… సంజీవ్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మధుర ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ ,బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

https://twitter.com/AlluSirish/status/1009648424130568194

- Advertisement -