వోడాఫోన్ ఓ చెత్త నెట్ వర్క్

316
vodafone-allu-sirish
- Advertisement -

వోడాఫోన్ సంస్థపై టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ కు కోపం వచ్చింది. ఎంత కోపం అంటే, తన ట్విట్టర్ ఖాతాలో సంస్థను ఏకిపారేసేంత. అల్లు శిరీష్‌ కోపానికి కారణం ఏంటంటే తాను ఈ మధ్యనే ఎయిర్‌ టెల్‌ నుంచి వోడాఫోన్‌ కి మారానని, అది తాను తీసుకున్న చెత్త నిర్ణయమని అల్లు శిరీష్‌ చెప్పుకొచ్చాడు.

allu sirish

ఎయిర్ టెల్‌ సిగ్నల్‌ వ్యవస్థ సరిగా ఉండలేదంటే ఇప్పుడు వోడాఫోన్‌ సిగ్నల్‌ వ్యవస్థ అంతకన్నా వరెస్ట్‌గా ఉందని, 4జీ సిగ్నల్‌ కాదు కదా.. కనీసం 2జీ సిగ్నల్స్‌ కూడా రావడం లేదని శిరీష్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాల్ డ్రాప్స్ సంగతి పక్కనబెట్టండి. కనీసం సిగ్నల్ కూడా అందని పరిస్థితి. చాలా చింతిస్తున్నాను. ఓ పాఠం నేర్చుకున్నాను అని తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఉదయం ఓ పోస్టు పెట్టాడు. ఇక ఓ సెలబ్రిటీగా ఉన్న శిరీష్ పెట్టిన పోస్టుపై వోడాఫోన్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

- Advertisement -