మలయాళంలో సూపర్ సక్సెస్ సాధించిన చిత్రం ఎబిసిడి. తెలుగులో అల్లు శిరీష్ హీరోగా వస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తుండగా… సంజీవ్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టును మధుర ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై మధుర శ్రీధర్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
యూఎస్ నుంచి ట్రిప్ కోసం ఇండియాకు వచ్చిన ఓ అబ్బాయి మిడిల్ క్లాస్ లైఫ్‌ను లీడ్ చేసి, ఏం తెలుసుకున్నాడన్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు అల్లు శిరీష్. సినిమాలో నేను కన్‌ఫ్యూజ్డ్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాను కావచ్చు. కానీ ప్రేక్షకులందరికీ ఫిబ్రవరి 8, 2019న థియేటర్‌లో వినోదాన్ని పంచడం
పక్కా అంటూ పోస్ట్ చేశాడు.
బాల నటుడిగా ఎంటర్‌టైన్ చేసిన మాస్టర్ భరత్ అల్లు శిరీష్ స్నేహితుడిగా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ పోషిస్తున్నారు.నూతన దర్శకుడు సంజీవ్‌రెడ్డి ఈ రీమేక్‌ను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను ‘పెళ్లిచూపులు’ నిర్మాత యశ్ రంగినేని, మధుర శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ జుడా స్యాండీ సంగీతమందిస్తున్నారు.
https://twitter.com/AlluSirish/status/1050002977145180161