స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, దిల్ రాజు, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం `డి.జె…దువ్వాడ జగన్నాథమ్`. మహా శివరాత్రి సందర్భంగా విడుదలైన టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పూర్తి భక్తి కంటెంట్‌తో ఉన్న ఈ టీజర్‌లో అల్లు అర్జున్ ఇంతకు ముందెన్నడూ కనిపించని డిఫరెంట్ లుక్‌తో అదరగొట్టాడు. నుదిటిన నామాలు పెట్టుకుంటూ.. తెల్లటి వస్త్రాలు, పాత మోడల్ బజాజ్ చేతక్ బండిపై కూరగాయాలను పెట్టుకుని వస్తోన్న పంతులు గారి గెటప్‌లో బన్నీని చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
ఫస్ట్ లుక్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన డీజే టీం ఇప్పుడు టీజర్ తో రికార్డుల వేట మొదలెట్టింది. గురువారం రిలీజ్ అయిన డీజే ఫస్ట్ లుక్ టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కేవలం 50 గంటల్లో ఈ టీజర్ మిలియన్ వ్యూస్ మార్క్ ను దాటి బన్నీ కెరీర్ లో సరిaకొత్త రికార్డ్ సృష్టించింది.
అదే జోరును కంటిన్యూ చేస్తూ 2 మిలియన్ మార్క్ ను దాటి దూసుకుపోతొంది. ఇప్పటికే 25 లక్షలకు పైగా వ్యూస్ సాధించిన డీజే దువ్వాడ జగన్నాథమ్ టీజర్ ముందు ముందు మరిన్ని రికార్డ్ లు సృష్టిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తుండగా బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ పై స్పందించిన హీరో అల్లు అర్జున్, దర్శకుడు హరీష్ శంకర్ లు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.