‘నేను, నా లిటిల్ ఏంజెల్’ …

224
- Advertisement -

స్టైలిష్ స్టార్‌గా, అద్భుతమైన డాన్సర్‌గా తెలుగు ప్రజలు బన్నీని ఆదరిస్తున్నారు. అంతేకాదు..మెగా ఫ్యామిలీలో ఉన్న క్రేజీ హీరోలలో అల్లు అర్జున్‌కు ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. ఇవే కాకుండా బన్నీలో ఇంకో కోణం కూడా ఉంది.

వెండితెరపై హీరో పాత్రను ఎంతో ఎనర్జిటిక్‌గా పోషిస్తున్న అల్లు వారబ్బాయి.. నిజ జీవితంలో తండ్రి పాత్రను చాలా సాఫ్ట్‌గా పోషిస్తున్నారు.

 Allu Arjun's daughter's pic on Twitter goes viral within minutes of sharing!

‘దువ్వాడ జగ్నాథం’ సినిమా తరవాత కాస్త ఖాళీ అయిన బన్నీ ప్రస్తుతం తన కూతురు అర్హతో ఎంజాయ్ చేస్తున్నాడు. ‘నేను, నా లిటిల్ ఏంజెల్ అల్లు అర్హ!’ అంటూ మంగళవారం ఉదయం అల్లు అర్జున్ ఓ అద్భుతమైన ఫొటోని ట్వీట్ చేసి కూతురుతో తాను చేస్తున్న సరదాను అభిమానులతో పంచుకున్నాడు.

ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కూతురుని గాల్లోకి ఎత్తిపట్టుకుని ఆమె బోసి నవ్వులు నవ్వుతుంటే ఆ ఆనందంతో బన్నీ ముఖం వెలిగిపోతోంది. ప్రముఖ ఫొటోగ్రఫీ స్టూడియో ‘పిక్ ఎ బో’ తీసిన ఈ ఫొటోపై అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. బ్లూ ఫ్రాక్, వైట్ షూస్ వేసుకున్న అర్హ నిజంగా ఏంజెల్‌లానే ఉంది. ప్రస్తుతం ‘దువ్వాడ జగన్నాథం’ తరవాత అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య – నా ఊరు ఇండియా’ సినిమాలో నటిస్తున్నాడు.

- Advertisement -