డాడీ ఎప్పుడూ హీరోనే

248
Stylish Star Allu Arjun Ayaan Daughter Arha
- Advertisement -

పైన ఫొటో మస్తుగుంది కదా..  ఆ ఫోటో చూస్తే అర్జున్‌ ఫాదర్‌హుడ్‌ని బాగా ఎంజాయ్‌ చేస్తున్నట్లు అనిపిస్తోంది కదూ. బన్నీ తన ముద్దుల కూతురు అర్హాని గాల్లోకి ఎగరేసి తెగ ముచ్చటపడిపోతున్నారు. చిన్నారి అర్హా చిరునవ్వులు చిందిస్తూ కనువిందు చేసిన వేళ కెమెరా క్లిక్‌మంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో హాట్ టాపిక్ అయింది.

స్టిల్‌ అదిరింది.‘‘కూతుళ్లకు ఫస్ట్‌ లవ్‌ ఎవరంటే అది డాడీయే. అలాగే వాళ్లకు డాడీ ఎప్పుడూ హీరోనే’’ అంటూ ఫొటో కింద తండ్రీ కూతుళ్ల అనుబంధం గురించి  పేర్కొన్నారు బన్నీ.  కూతురుతో ఆనందంగా గడుపుతున్న క్షణాలకు సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియా లక్షలాది లైక్స్‌తో సంచలనం అయింది.

Allu Arjun's Cute Daughter Craze in SM

ఏ తండ్రికైనా కూతురే యువరాణి. వారు ఎదుగుతున్న క్షణాలను చూస్తున్నపుడు తండ్రి పొందే ఆనందం వెలకట్టలేనిది. అలాంటి ఆనందమే ఈ ఫోటోలో బన్నీ మొహంలో కనిపిస్తోంది.మరో మూడు నెలల్లో అర్హ ఫస్ట్ బర్త్ డే రాబోతోంది. తన ప్రియమైన కూతురు మొదటి బర్త్ డేను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారట బన్నీ.

- Advertisement -