బన్నీతో మూవీకి కొరటాల ప్లాన్..?

212
Allu Arjun with Koratala next Movie..?
- Advertisement -

మహేష్‌ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భరత్ అనే నేనే’. ఈ సినిమాతో మరోక హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు డైరెక్టర్ కొరటాల శివ. సందేశాత్మక చిత్రాలను తనదైన రీతిలో తెరకెక్కిస్తూ వరుస విజయాలను అందుకుంటున్నాడు. విడుదలైన రెండు రోజులకే రికార్డులను బ్రేక్ చేస్తూ రూ.100 కోట్లు మార్క్‌ను దాటుకుంది ఈ చిత్రం. ఈ చిత్రం విజయాన్ని అస్వాదిస్తున్నాడు కొరటాల.

అయితే ఈ సినిమా అనంతరం కొరటాల ఎవరితో సినిమా చేస్తాడన్న ప్రశ్న ఇప్పుడు అందరి నోళ్లల్లో నానుతోంది. కథ రచయిత నుంచి డైరెక్టర్‌గా మారి తనదైన పంథాలో విన్నూత్న రీతిలో ఆయన సినిమాలు తెరకెక్కిస్తున్నారు. అందుకే స్టార్ హీరోలు సైతం ఆయన సినిమా కోసం ఎదురుచుస్తున్నారట.

Allu Arjun with Koratala next Movie..?

ఈ నేపధ్యంలో ‘భరత్ అనే నేనే’ చిత్రం తర్వాత తాను ఏ హీరోతో సినిమాలు చేస్తున్న విషయాలను అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. ఒక పక్క నిర్మాతగా మారుతున్నాడన్న వార్తలు కూడా జోరుగా బలంగా వినిపిస్తున్నాయి. కానీ ప్రస్తుతం ‘నా పేరు సూర్య’ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎవరితోనూ సినిమాలకు ఒప్పకోలేదు. అందుకే బన్నీతో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట కొరటాల. అయితే వీరిద్దరి కాంబినేషన్‌లో మూవీ ఎప్పుడు పట్టాలెక్కనుంది అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే వేచి చూడాల్సిందే.

- Advertisement -