బోయపాటిని పరామర్శించిన అల్లు అర్జున్..

1519
boyapati srinivas

దర్శకుడు బోయపాటి శ్రీనివాస్‌ని పరామర్శించారు హీరో అల్లు అర్జున్. జనవరి 17న బోయపాటి తల్లి సీతారావమ్మ(80) మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బోయపాటితో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు బన్నీ.

పలువురు సినీ ప్రముఖు బోయపాటికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బోయపాటి స్వస్థలం పెదకాకానికి చేరుకుని పరామర్శించారు నారా లోకేష్,నందమూరి బాలకృష్ణ.

ఇక బోయపాటి, బన్నీ కాంబినేషన్‌లో వచ్చిన ‘సరైనోడు’ సినిమా సూపర్‌హిట్‌ అయిన విషయం తెలిసిందే. బన్నీ ప్రస్తుతం సుకుమార్‌తో మూడో సినిమా చేస్తుండగా.. బోయపాటి బాలయ్యతో హ్యాట్రిక్ సినిమా చేయనున్నాడు.