అల్లు అర్జున్‌..సొంత కుంపటి…!

228
Allu Arjun turns producer
- Advertisement -

ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మరో సినిమాని లైన్లో పెట్టేసే బన్నీ  త్వరలోనే కొత్త అవతారం ఎత్తనున్నాడు.  ‘దువ్వాడ జగన్నాథమ్’ తర్వాత ప్రస్తుతం బన్నీ చేస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య’ . రైటర్ టర్న్డ్ డైరెక్టర్ వక్కంతం వంశీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో బన్నీ సరసన అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్. సీనియర్ హీరోలు అర్జున్, శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న బన్నీ ఈ ఇయర్ ఎండ్‌కి ‘నా పేరు సూర్య’ పూర్తి చేస్తాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనేదానిపై సస్పెన్స్  ఉండగా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఓ వార్త మాత్రం హల్ చల్ చేస్తోంది. తన నెక్స్ట్ ప్రాజెక్టు మొదలుకావడానికి ముందు నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యాడట.

Allu Arjun turns producer
సొంతంగా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసే ఆలోచనలో బన్నీ ఉన్నాడట. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయట. ఈ నిర్మాణ సంస్థలో తాను ఏ సినిమా చేయాలనే విషయంలోనూ ఆయన పూర్తి స్పష్టతతో వున్నాడని టీ టౌన్‌ వర్గాల టాక్‌. 2018 ఏప్రిల్ లో ఈ బ్యానర్లో సినిమా ఉంటుందని చెబుతున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందట.

ఇప్పటికే పవన్ కల్యాణ్,మహేశ్ బాబు,రామ్‌ చరణ్ ఇప్పటికే సొంత నిర్మాణ సంస్థలను ఏర్పాటు చేసుకున్నారు. సొంత బ్యానర్ పై అవసరమైతే తమ సినిమాలు .. లేదంటే ఇతర హీరోల సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. వీరి బాటలోనే త్వరలో బన్నీ చేరనున్నాడు.

- Advertisement -