ట్యాక్సీవాలాతో అర్జున్‌ రెడ్డిని మరిపిస్తా…

171
Vijay Devarakonda special interview..
- Advertisement -

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్‌ని సృష్టించిన హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమాతో  ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన విజయ్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఏ మంత్రం వేశావే, మహానటి, ట్యాక్సీవాలా సినిమాల్లో నటిస్తున్న విజయ్‌ ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

అర్జున్ రెడ్డి సినిమా చేస్తున్నప్పుడే .. ఇంతవరకూ ఎవరూ చేయని సినిమాను నేను చేస్తున్నానని అనిపించింది. ఆడియన్స్ కి బాగా నచ్చుతుందని అనుకున్నాను .. అలాగే ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది అన్నాడు. ‘ట్యాక్సీ వాలా’ సినిమాతో అర్జున్ రెడ్డిని మరిపిస్తానని స్పష్టం చేశారు.  ఈ సినిమాలో నేను క్యాబ్ డ్రైవర్ గా కనిపిస్తాను .. ఇదొక సూపర్ నేచురల్ థ్రిల్లర్. నా నుంచి అభిమానులు ఆశించే విధంగా ఈ సినిమా ఉంటుందన్నారు.

Vijay Devarakonda special interview..
‘మహానటి’ చిత్రంలోనూ నటిస్తున్నాను. కానీ అందరూ అనుకుంటున్నట్లు నేను ఎంజీఆర్‌ పాత్రలో కానీ ఎన్టీఆర్‌ పాత్రలో కానీ నటించడం లేదు. నేను, సమంత జర్నలిస్ట్‌ పాత్రల్లో నటిస్తున్నాం. నా పాత్ర చిన్నదే అయినా ఓ గొప్ప నటి జీవితాధారంగా తీస్తున్న సినిమాకాబట్టి ఎలాంటి పాత్రైనా ఫర్వాలేదని చెప్పుకొచ్చాడు.  మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా…ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు.

- Advertisement -