బేగంపేటలో అల్లు అర్జున్, త్రివిక్రమ్

314
Allu-Arjun-Trivikram-Movie-Launched
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇటివలే ఈచిత్రం పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈరోజు నుంచి ఈసినిమా రెగ్యూలర్ షూటింగ్ ను ప్రారంభించారు. హైదరాబాద్ లోని బేగంపేట పోలీస్ లైన్స్ లో షూటింగ్ జరుగుతుంది. బన్నీ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డె నటించగా..అక్కినేని సుశాంత్, నవదిప్ లు ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.

త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ వస్తున్న మూడవ సినిమా కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు ఘన విజయాన్ని సాధించాయి. ఈమూవీపై కూడా భారీ అంచనాలున్నాయి. ఇప్పటి వరకూ త్రివిక్రమ్ తండ్రి సెంటిమెంట్ తో సినిమా తీశాడు..కానీ ఈసారి తల్లి సెంటిమెంట్ తో తీయనున్నాడని తెలుస్తుంది.

అల్లు అర్జున్ కు తల్లి పాత్రలో సీనియర్ హీరోయిన్ నగ్మా నటించనుందని తెలస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈమూవీని గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని బ్యానర్ పై సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. దసరా సెలవుల్లో ఈమూవీని విడుదల చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు చిత్రయూనిట్.

- Advertisement -