ఎట్టకేలకు చాలా రోజుల గ్యాప్ తర్వాత తన తర్వాతి సినిమాను ప్రారంభించాడు బన్నీ. నాపేరు సూర్య నాఇల్లు ఇండియా సినిమా తర్వాత ఇప్పటి వరకూ ఏసినిమా చేయలేదు అల్లు అర్జున్. వరుసగా ఒకే మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బన్నీ. మొదటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈసినిమా ఈరోజు పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈకార్యక్రమంలో అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు చినబాబు, అల్లు అరవింద్ లు పాల్గోన్నారు.
ఈచిత్రాన్ని గీతా ఆర్ట్స్ , హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్ధ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎప్రిల్ 24 నుంచి ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభంకానుంది. బన్నీ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డెను తీసుకున్నారు. ఈసినిమా తర్వాత అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ …కనబడటం లేదు అనే సినిమాను చేయనున్నాడు.
దాంతో పాటు తనకు ఆర్య, ఆర్య2 లాంటి సూపర్ డూపర్ హిట్లను ఇచ్చిన సుకుమార్ తో తన తర్వాతి సినిమాను చేయనున్నాడు బన్నీ. ఇన్ని రోజుల గ్యాప్ తర్వాత ఒకేసారి మూడు సినిమాల్లో చేస్తుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్న బన్నీ అభిమానులు.